ప్రముఖ నటుడు ఉపేంద్ర అటు రాజకీయాల్లోనూ ఇటు సినీరంగంలోనూ బిజీబిజీగా గడిపేస్తున్నా ‘ఐ లవ్ యూ’ అనంతరం దర్శకుడు ఆర్.చంద్రుతో కలసి ‘కబ్జా’ అనే టైటిల్‌తో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈచిత్రంలో ఉపేంద్ర రకరకాల షేడ్‌లలో కనిపించడం ద్వారా తన అభిమానులను మెప్పించనున్నారు. ఇందుకోసం ఆయన సిక్స్‌ప్యాక్ శిక్షణ పొందుతున్నారని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చందనసీమలో దర్శకుడు చంద్రు చిత్రం అంటేనే అత్యంత భిన్నంగా ఉంటుంది.
రౌడీయిజం నేపథ్యంలో అనేక చిత్రాలలో నటించిన ఉపేంద్ర ‘ఓం’ చిత్రంలో రియల్ రౌడీలనే రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో కబ్జా చిత్రంలోనూ ఇంతవరకు ఎవరూ చేయని అనేక భిన్నమైన ప్రయోగాలు చేయబోతున్నట్టు సమాచా రం. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ, మళయాళంతో సహా మొత్తం 7భా షలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు దర్శకుడు ఆర్.చంద్రు శనివారం మీడియాకు తెలిపారు. చంద్రు, ఉపేంద్ర కాంబినేష న్‌లో వస్తున్న మూడో చిత్రం కబ్జా. ఇంతవరకు వెలువడిన రెండు చిత్రాలు బాక్సాఫీస్ హిట్ అందుకున్నాయి. 7 భాషలలో ఈ సినిమా విడుదల చేస్తుండడం మరో రికార్డు కానుంది.
హీరోయిన్లపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు