తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు విజయశాంతి బీజేపీలో చేరేందుకు అన్ని కసరత్తులు పూర్తయినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి ఇటీవల భేటీ కాగా, అంతకుముందే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండుసార్లు సమావేశమయ్యారు. సంజయ్‌తో సమావేశానికి ముందే విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో సమావేశమైనట్లుగా విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం. ఆ తరువాత విజయశాంతి తన విమర్శల్లో పదును పెంచారు. విజయశాంతి పార్టీని వీడరని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే.. తాజాగా విజయశాంతి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. రేపు విజయశాంతి ఢిల్లీకి పయనమయ్యారు. ఈ టూర్‌లో బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలుస్తారని ప్రచారం జోరందుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి.. ఆయన సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా…విజయశాంతి రాజకీయ అరంగేట్రం బీజేపీతోనే చేసిన విషయం తెలిసిందే.
next post
రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు: మాయావతి