telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

14 ఏళ్ళ బాలిక గదిలో అతను రహస్యంగా…!?

Crime

అమెరికాలోని టెన్నెస్సీలో కూతురితో కలిసి నివాసముంటోందా మహిళ. ఆ రోజు షాపింగ్‌కు వెళ్లి ఇంటికొచ్చింది. అలా వచ్చేసరికి ఇంట్లోని మెట్లపై ఓ కుర్రాడు కూర్చొని ఉండటం గమనించింది. ఇంటికి తాళం వేసి వెళితే అతను లోపలకు ఎలా వచ్చాడా అనుకొని, హేయ్ ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావ్? అంటూ అతన్ని ప్రశ్నించింది. ఆమె కంటపడిన వెంటనే భయంతో పారిపోయిన ఆ కుర్రాడు గబగబా ఆమె కూతురి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఆమె ఎంతగా పిలిచినా బయటకు రాలేదు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి ఆమె కుమార్తె గది మొత్తం గాలించినా ఆ కుర్రాడు కనిపించలేదు. అనుమానం వచ్చి ఇంటి ఆటిక్ (పైకప్పుకు ఇంటికి మధ్య ఉండే ప్రాంతం)లో చూశారు. అక్కడకు వెళ్లడానికి ఆ బాలిక గదిలో మార్గం ఉన్నట్లు గుర్తించారు. ఆటిక్‌లో ఉన్న 18 ఏళ్ల మాథ్యూ క్యాస్టోను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో అతను చాలా రోజులుగా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. బాలికకు ఈ విషయం తెలుసని, వారిద్దరూ కలిసే ఈ పథకం వేశారని తేల్చారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలియదని చెప్పారు. కానీ ప్రతిరోజూ అర్థరాత్రి వారిద్దరూ కలిసుకునేవారని, ఈ తతంగం గుట్టుచప్పుడు కాకుండా చాలా రోజులుగా నడుస్తోందని చెప్పారు. మాథ్యూను పోలీసులు అరెస్టు చేయడంతో ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆ బాలికను కూడా మరుసటి రోజు పట్టుకొని ఇంటికి చేర్చారు.

Related posts