telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డబుల్‌ డోస్‌” ఇస్తానంటున్న మంచు హీరో..

శ్రీను వైట్ల- మంచు విష్ణు కాంబినేషన్‌లో వచ్చిన “ఢీ” సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ సినిమాతో మంచు విష్ణు హీరోగా మంచి పేరు సంపాదించాడు. దీంతో అదే కాంబినేషన్‌ను మళ్లీ రిపీట్‌ చేయనున్నాడు విష్ణు. ఇవాళ విష్ణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన నెక్ట్స్‌ మూవీని అనౌన్స్‌ చేశాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా “డబుల్‌ డోస్‌”{ఢీఢీ} మూవీని ప్రకటించారు. ఈ సందర్భంగా విష్ణు ట్వీట్‌ చేశాడు. పెద్ద అన్నయ్య శ్రీను వైట్లతో మరోసారి సినిమా చేయడం చాలా ఉత్సాహంగా ఉందని విష్ణు చేశాడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా.. మంచు విష్ణు హీరోగా వస్తోన్న సినిమా ‘మోసగాళ్లు’. అయితే ఈ చిత్రంలో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అన్నాచెల్లెలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కథ గురించి విష్ణు ఇటివలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఈ సినిమా యూనివర్సల్ స్టోరీతో రాబోతుందని.. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని, ఇక తెలుగు వర్షన్ లో కొన్ని మార్పులు చేశామని, ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తుందని విష్ణు నమ్మకంగా చెప్పుకొచ్చారు. 

Related posts