బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఐదు పదుల వయస్సులోను ఫుల్ స్పీడుతో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు షాకిస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయిందో లేదో వెంటనే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. ఈ ఏడాది అక్షయ్ కుమార్.. కేసరి, బ్లాంక్, మిషన్ మంగళ్, హౌజ్‌ఫుల్ 4 చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. గుడ్ న్యూస్, సూర్యవంశీ, లక్ష్మీ బాంబ్, పృథ్వీరాజ్ చిత్రాలు విడుదల కావలసి ఉంది. అయితే ఇండస్ట్రీలో 2019 వ సంవత్సరం బాలీవుడ్‌లో ‘అక్షయనామ సంవత్సరం‘గా నిలుస్తుంది. ఎందుకంటే హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి’, ‘మిషన్ మంగళ్’, హౌస్ ఫుల్-4’ సినిమాలు ఈ ఏడాదే విడుదలై విజయవంతం కాగా, ఈ నెల 27న ‘గుడ్‌న్యూస్’ విడుదల కానుంది. తాజాగా అక్షయ్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. బాలీవుడ్ సినిమాలలో తాను ఇంత దీర్ఘకాలం కొనసాగేందుకు తన కృషి, పట్టుదలతో పాటు, లక్ కూడా ఉందన్నారు. తన 11 సినిమాలు హిట్ అయ్యాయని, దీనికి ముందు 14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. అయితే ఫ్లాప్ అయిన సినిమాల కోసమే అమితంగా కష్టించానని అన్నారు. తన కెరియర్ మొత్తంగా చూసుకుంటే 70 శాతం లక్, 30 శాతం కృషి ఉన్నట్టు అనిపిస్తుందని అన్నారు.
previous post
next post
సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు నాకు తెలియదు… బాలయ్య సంచలన వ్యాఖ్యలు