telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్

Rajasekhar

సినీ హీరో రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అయ్యింది. నవంబర్‌లో ఓఆర్‌ఆర్ మీద అతి వేగంతో ప్రయాణించి డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. సైబరాబాద్ పోలీసులు అతని కారు నంబర్ పై స్పీడ్ లేజర్ గన్‌లు చిత్రీకరించిన దృశ్యాలను చూడగా.. దాదాపు 22 సార్లు అతి వేగంతో ప్రయాణించాడని స్పష్టమైంది. ఇలా తరచుగా అతివేగంతో ప్రయాణించడాన్ని పరిశీలించిన పోలీసులు.. అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని ఆర్‌టీఏ అధికారులకు సిఫార్సు చేశారు. దీంట్లో భాగంగా ఆర్‌టీఏ అధికారులు లైసెన్స్‌ను పరిశీలించగా.. 2017 లోనే అతని డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని తేలింది. దీంతో ఆర్‌టీఏ అధికారులు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేశారు. ఈ అంశంపై సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.

Related posts