telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘వి’ చిత్రంలోని ‘చూస్తున్నా చూస్తునే ఉన్నా’ సాంగ్ రిలీజ్

v

నాని నటిస్తున్న 25వ సినిమా ‘వి’. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘వి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఇటీవ‌ల‌ వీరిద్ద‌రి ఫ‌స్ట్ లుక్స్‌తో పాటు సినిమా టీజ‌ర్‌ను, ’మ‌న‌సు మ‌రీ మ‌త్తుగా..’ అనే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ‌స్ట్ లుక్స్‌తో పాటు టీజ‌ర్‌, లిరికల్ వీడియో సాంగ్‌కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా నుండి రెండో సాంగ్ ‘చూస్తున్నా చూస్తునే ఉన్నా..’ ను విడుద‌ల చేశారు. ప్ర‌ముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ పాట‌ను ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి రాయ‌గా.. శ్రేయా ఘోష‌ల్‌, అమిత్ త్రివేది, అనురాగ్ కుల‌క‌ర్ణి ఈ ఆల‌పించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. అదితిరావు, నివేదాథామస్‌ హీరోయిన్స్‌. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సిినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్ చేస్తున్నారు.

Related posts