telugu navyamedia
సినిమా వార్తలు

ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష సూసైడ్ : ఉపాసన ఎమోషనల్ ట్వీట్

*హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
*ప్ర‌త్యూష్ డెడ్‌బాడీ బాత్‌రూంలో గుర్తింపు..
*దిగ్భ్రాంతికి గురైన మెగా కోడ‌లు ఉపాసన..ట్వీట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.పోలీసులు వెంటనే మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. విషవాయువు పీల్చడం వల్ల శ్వాస ఆగిపోయి చనిపోయినట్లుగా డాక్టర్ల వెల్లడించారు.

Prathyusha Garimella is found died mysteriously. | KIRAK POSTER

ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రత్యూష తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది హీరోహీరోయిన్లకు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. టాలీవుడ్‌లో శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేశ్‌, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్, రానా, రామ్‌ చరణ్‌లకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు.

RRR actor Ram Charan's wife Upasana mourns the death of fashion designer Prathyusha Garimella; calls her 'dearest friend'

బాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోయిన్లకు సైతం ఆమె ఫ్యాషన్‌ డిజైనర్‌గా వర్క్‌ చేశారు. దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, మాధురి దీక్షిత్‌, విద్యాబాలన్‌కు కూడా వర్క్‌ చేశారు. ఆమె డిజైన్‌ చేసిన డ్రెస్సులను కూడా చాలా మంది సెలబ్రెటీలు ఎండార్స్‌ కూడా చేశారు.

దీంతో ఆమె సినీ సెలబ్రెటీలు హీరోయిన్లు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో​ ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష ఆత్మహత్యపై దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రత్యూషతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Hyderabad fashion designer found dead in her home

ఈ మేరకు ప్రత్యూషతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసుకుంటూ ట్వీట్ చేశారు.. ‘మై బెస్టీ మై డియరెస్ట్‌ ఫ్రెండ్‌. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రత్యూష అన్ని విషయాల్లో చాలా గొప్పగా ఆలోచించేదని..ఇక కెరీర్‌, ఫ్యామిలీ, స్నేహితులు విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె అనుకోకుండా డిప్రెషన్‌కు గురవ్వడం బాధాకరమని అన్నారు .

ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందనేది నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఉపాసన భావోద్వేగానికి లోనయ్యారు.

Related posts