మలిదశ తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారి (55) అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీసు ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయన భార్య శంకరమ్మ శనివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే…
హయత్‌నగర్ పరిధిలోని సూర్యనగర్ కాలనీ రోడ్డు నంబర్-8లో వెంకటాచారి ఆయన భార్య శంకరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. శ్రీకాంతాచారి తండ్రి వెంక టచారి ప్రజాశాంతి పార్టీలో చేరారు.
జూన్ 1న మధ్యాహ్నం పనిమీద బయటికి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్లాడని. 2వ తేదీన సోషల్ మీడియా ద్వారా అతను ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ వద్ద ఉన్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా ఎత్తలేదని అని శంకరమ్మ పోలీసులకు వెల్లడించింది.
వెంకటచారి ఎంతకీ తిరిగి రాపోవడంతో ఆయన కేఏ పాల్ వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తూ శంకరమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్బీనగర్ జంక్షన్‌లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద కేఏ పాల్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి కేఏ పాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన కొన్ని రోజులకే తన భర్త వెంకటాచారి కనిపించడం లేదని శంకరమ్మ పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ బాగుపడాలంటే ఉత్తమ్ తప్పుకోవాలి: రాజగోపాల్రెడ్డి