telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ చెప్పడంలేదు: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో టీఆర్ఎస్ చెప్పడంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ)లపై నిజామాబాద్ లో బీజేపీ ప్రజా ప్రదర్శన నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, తదితర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టేనని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన మైనారిటీల గురించి ప్రస్తుతం మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టంతీసుకొస్తే కాంగ్రెస్ విమర్శిస్తోందని ధ్వజమెత్తారు. సీఏఏ కాంగ్రెస్ హయాంలో చేసిందని, దాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించిందన్నారు. మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్పా అంటూ ప్రశ్నించారు.

ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. దేశంలో గత ఆరేళ్ల నుంచి మంచి పనులు జరుగుతున్నాయన్నారు. స్వాతంత్ర్యం కంటే ముందు మన దేశం హిందూ రాష్ట్రమని అన్నారు. అనంతరమే సెక్యులర్ అయిందన్నారు. సీఏఏను 80శాతంపైగా దేశ ప్రజలు సమర్థిస్తున్నారన్నారు. పాకిస్థాన్ లో 23 శాతం ఉన్నహిందూ జనాభా ప్రస్తుతం 3శాతానికి పడిపోయిందన్నారు.

Related posts