telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు..సిద్ధంగా ఉండండి –

*మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు వ్యాఖ్య‌లు చేశారు.
*ఈ నెల 18న లేదా 19న జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న‌
*ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు..సిద్ధంగా ఉండండి..
*తుమ్మ‌ల, పొంగిలేటి లాంటి సీనియ‌ర్లు అవ‌స‌రం పార్టీకి ఉంది.
*ఖ‌మ్మం జిల్లా నేత‌ల‌తో మంత్రి కేటీఆర్ స‌మావేశం

ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు..సిద్ధంగా ఉండండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు వ్యాఖ్య‌లు చేశారు. ఖమ్మంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్​..ఉమ్మ‌డి జిల్లా ముఖ్యనేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ నెల 18 లేదా 19న జాతీయ పార్టీ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 18 లోపే రాష్ర్ట కార్య‌వ‌ర్గ స‌మావేశం ఉంటుంద‌ని, ఆ స‌మావేశంలో జాతీయ పార్టీ గురించి క్లారిటీ ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

అలాగే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, మార్పులు ఖ‌చ్చితంగా ఉంటాయ‌ని అన్నారు. పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. తుమ్మ‌ల, పొంగిలేటి లాంటి సీనియ‌ర్లు అవ‌స‌రం పార్టీకి ఉంద‌ని చెప్పారు. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా పనిచేయాలని నేతలకు మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

అసంతృప్తి నేతలు పార్టీ మారుతారన్న ప్రచారం దృష్ట్యా.. ఈ ప్రత్యేక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉమ్మడి జిల్లాలోటీఆర్ ఎస్‌ బలోపేతంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. నేతల మధ్య విభేదాలు పరిష్కారం కోసం నేతలతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. టీఆర్ ఎస్‌ ప్రాతినిధ్యం వహించే స్థానాల్లో నేతల మధ్య విభేదాలు ఉండకూడదని సూచించారు.

ఖమ్మం మినహా ఇతర నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్రూప్‌ రాజకీయాలు తగదని హితవు పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts