telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కళ్యాన్ చేతుల మీదుగా “శశి” ట్రైలర్

చాలా రోజులుగా ఓ హిట్ సినిమా కోసం ప్రయత్నిస్తున్న హీరో సాయి కుమార్ కుమారుడు ఆది. సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన గుర్తింపు మాత్రం అందడంలేదు. చెప్పుకోదగ్గ హిట్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆది నటించిన సినిమా శశి. ఈ సినిమా శ్రీనివాస నాయుడు దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో ఆది సరసన బ్యూటీ సురభి హీరోయిన్‌గా కనిపించింది. అయితే తాజాగా పవన్ కళ్యాన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్ తో పాటు ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తోందని, ట్రైలర్ కూడా అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆర్‌.పి.వ‌ర్మ, సి.రామాంజ‌నేయులు,చింత‌ల‌పూడి శ్రీ‌నివాస్ చెబుతున్నారు. ‘మనం ప్రేమించే వాళ్ళు పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో.. ప్రమాదంలో ఉన్నప్పుడు అంతే భయంగా ఉంటుంది’ అనే ఆది డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ఇక ‘మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, ముందు మన బలహీనతలను గెలవాలి’… ‘ప్రేమంటే లేని చోట వెతుక్కోవడం కాదు.. ఉన్న చోట నిలబెట్టుకోవడం’… ‘ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం’ వంటి డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఈ పవర్ ఫుల డైలాగ్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కి కూడా ఇందులో చోటు కల్పించారు. గత కొంత కాలంగా హిట్ లేని ఆదికి రాబోయే ఈ ‘శశి’ ద్వారా అయినా విజయం దక్కుతుందేమో చూద్దాం.

Related posts