telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ‌లో ప్రారంభమైన టెట్​ పరీక్ష…

తెలంగాణలో టీచర్ ఎలిజబులిటీ టెస్టు (టెట్)ప్రారంభమైంది..ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ నిర్వహిస్తారు. మొత్తం 2683 సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది..

ఈనెల 27న టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ పేపర్‌-1 పరీక్షకు 1,480 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు.

అభ్యర్థులంతా గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.  ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్ధులను పరీక్షా కేంద్రలను అనుమతించబోమని అధికారులు ప్రకటించారు. 

ఓఎమ్‌ఆర్‌ షీట్లను చించడం, మతడపెట్టడం చేయరాదు. నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు కాబట్టి తెలిసినవి ఆన్సర్‌ చేసి ఆ తర్వాత ఖచ్చితంగా తెలియని, ఊహించి చెప్పగలిగేవి ఆన్సర్‌ చేయండి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంద‌ని తెలిపారు.

Related posts