సమాజం తీరు
కండలు మెండుగా ఉన్నప్పుడు
అందరికీ బంధువే
ధన ధాన్యాలు ఉన్నప్పుడు
అందరూ మనవాళ్ళే
కయాకష్టం చేసేటప్పుడు
అందరికీ అవసరమే
అడిగింది లేదనకుండా ఇస్తుంటే
దేవుడంటారు
నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారు
వయస్సు పైబడితే
దేహం ముసలిదైతే
బలం బలహీనమైతే
కష్టపడే ఓపిక లేకుంటే
ధన ధాన్యలు కరిగిపోతే
మోడు భారిన జీవితాలై
చితికిన బ్రతుకులై
ఆధారణ కరువై
ప్రేమ మరుగై
బ్రతుకే బరువై
ఊపిరి గాల్లో
దేహం మట్టిలో
-ఎస్.చిన్నికృష్ణ, చిత్తూరు.
హిందూ గ్రంధాల్లో కావాల్సినంత హింస: సీతారాం ఏచూరి