telugu navyamedia
సినిమా వార్తలు

18 నెలలు గడువివ్వండి… తెలుగు ప్రేక్షకులకు సిద్ధార్థ్ ట్వీట్

Siddharth

“బొమ్మ‌రిల్లు” చిత్రంలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సిద్ధార్థ్ ఆ త‌ర్వాత “బావ‌”, “అన‌గ‌న‌గా ఓ ధీరుడు”, “జ‌బ‌ర్‌ద‌స్త్” లాంటి చిత్రాల్లో నటించాడు. అయితే “బొమ్మ‌రిల్లు” స్థాయి హిట్‌ను మాత్రం అందుకోలేక‌పోయాడు. ఆ తరువాత “బాద్‌షా”లో కీలక పాత్రలో కన్పించాడు. అనంతరం తమిళ సినిమాలపై దృష్టి సారించారు. 2012 త‌ర్వాత తెలుగులో విడుద‌లైన సిద్ధార్థ్ సినిమాల‌న్నీ అనువాద చిత్రాలే. స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలేవీ లేవు. తెలుగు ప్రేక్ష‌కులు సిద్ధార్థ్ అనే హీరో ఉన్నాడ‌నే మ‌ర‌చిపోయారు. ఈ నేప‌థ్యంలో సిద్ధార్థ్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. “ఎవ‌డు ఏమ‌న్నా నేను తిరిగి వ‌స్తానులే. నా ప్రామిస్‌ను గుర్తంచుకోండి. నా శ‌క్తి మేర తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి మ‌ళ్లీ ప్ర‌యత్నిస్తాను. నాకు 18 నెల‌లు గ‌డువు ఇవ్వండి. తెలుగు ప్రేక్ష‌కులారా! మిమ్మ‌ల్ని నిరాశపెట్ట‌ను. మంచి కంటెంట్ ఉన్న సినిమాతో హార్డ్ వ‌ర్క్ చేసి మీ ముందుకొస్తాను… అప్పుడు మాట్లాడుకుందాం” అని తెలిపారు సిద్ధార్థ్‌.

Related posts