telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాబోయే భర్త గురించి జాన్వీ కపూర్… శ్రీదేవి ఏం చెప్పిందంటే ?

Jhnavi-Kapoor

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “కార్గిల్ గర్ల్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు సినిమా స్క్రిప్ట్స్ ఎంపికలో జాగ్రత్త వహించడమే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ జాగ్రత్తలు వహిస్తుంటారు. తెరపై అందంగా కనిపించడం కోసం జాన్వీ జిమ్ లో చాలాసేపు కష్టపడుతూ ఉంటుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఓ మేగజైన్ పేజ్ కు ఇచ్చిన పోజ్ ఒకటి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. ఈ సందర్భంగా తన తల్లి శ్రీదేవితో ప్రేమానుబంధాన్ని గుర్తు చేసుకుంది జాన్వీ. తాను అమ్మతో అబ్బాయిల గురించి చర్చించేదాన్నని, పెళ్లి గురించి మాట్లాడేదానని చెప్పుకొచ్చింది. అయితే, తన నిర్ణయాలను అమ్మ ఎప్పుడూ నమ్మేది కాదని, ముఖ్యంగా పురుషుల విషయంలో అస్సలు నమ్మదని వెల్లడించింది. అందుకు కారణం.. తాను ప్రేమలో త్వరగా పడతానని వివరించింది. మంచి భర్తను వెతికి పెడతానని తన తల్లి చెబుతూ ఉండేదని జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. ఇక, తనకు కాబోయే భర్త తెలివైన వాడై ఉండాలని, తానేం చేస్తున్నాడో దానిపై ఫ్యాషన్ ఉండాలని, ముఖ్యంగా అతడి నుంచి తాను నేర్చుకునేలా ఉండాలని చెప్పింది జాన్వీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నింటి కంటే ముఖ్యమని చెప్పింది. ఇదిలా ఉండగా పెళ్లిలో కాంజీవరం చీర ధరిస్తానని, తనకిష్టమైన దక్షిణాది వంటకాలతో దావత్ ఇస్తానని పేర్కొంది.

Related posts