telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ మెచ్చిన సొట్టబుగ్గల సుందరి… ఆమె నవ్వు ఇష్టమట…!

Chiranjeevi

నిఖిల్ హీరోగా తెరకెక్కిన సినిమా “అర్జున్ సురవరం”. ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. లావణ్య త్రిపాఠి హీరోయిన్. పోసాని కృష్ణముర‌ళి, సత్య, త‌రుణ్ అరోరా, వెన్నెల కిషోర్, నాగినీడు, విద్యుల్లేఖ రామన్ తదితరులు న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మంగళవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి చిరంజీవి మాట్లాడుతూ.. “ఒక విషయం చెప్పేస్తాను ఏమనుకోకు.. నీ నవ్వంటే ఇష్టం నాకు. ఆ చొట్టబుగ్గలు.. డింపుల్ భలే ఉంటుందిలే. మారుతి సినిమాలో లావణ్యను కళ్లు ఆర్పకుండా చూశాను. అంత బాగా చేసింది. మారుతి ఆ అమ్మాయిని అంత బాగా చూపించారు. ఈ సినిమాలో మరో కోణంలో అంతే బాగా చేసింది. ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది. ఆమె ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది. నాలాంటోడు కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా ద్వారా మరొక మెట్టు ఎక్కుతుంది. ఆ అమ్మాయి ద్వారా ఈ సినిమాకి చాలా హెల్ప్ జరిగింది” అని చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మాటల్లో ఈమధ్య చమత్కారం బాగా కనిపిస్తోంది. ఆ మధ్య ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలేలో చిరంజీవి తన చమత్కారం, పంచ్ డైలాగులతో అదరగొట్టారు. ఇటీవల ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్‌లో కూడా ఆసక్తికరంగా మాట్లాడారు. ఇప్పుడు ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

Related posts