telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మెగా ఫ్యామిలీ” పిల్లల సినిమా… అందుకే తీయట్లేదు : రామ్ గోపాల్ వర్మ

Ram-Gopal-Varma

రామ్ గోపాల్ వర్మ అంటేనే సంచలనం. ఏం చేసినా, ఏం చెప్పినా అది సంచలనమే… దీపావళి సందర్భంగా “కమ్మరాజ్యంలో కడప రెడ్లు” చిత్రంలోంచి ట్రైలర్ విడుదల చేసి తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఆ తరువాత “మెగా ఫ్యామిలీ” అంటూ ఓ సినిమా చేస్తున్నానని పేర్కోన్న వర్మ ఇప్పుడు మాత్రం అంతా తూచ్ అంటున్నాడు. అంతేకాదు మెగా ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి ఫ్యామిలీ అని అందరూ అనుకుంటారు. కానీ వర్మ మాత్రం ఓ నిర్వచనం ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంటే ఓ వ్యక్తికి 39 మంది సంతానం అని చెబుతూ మెగా ఫ్యామిలీ అనే టైటిల్‌తో సినిమా తీయట్లేదని చెప్పాడు. తనకు పిల్లలంటే ఇష్టం ఉండదని అందేకే ఈ సినిమా తీయట్లేదని మరోసారి ట్విట్టర్ వేదికగా పేర్కోన్నారు. కాగా నిన్న ట్విట్టర్‌లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తర్వాత తాను ‘మెగా ఫ్యామిలీ’ టైటిల్‌తో ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు కూడా. అంతేకాదు ‘మెగా ఫ్యామిలీ’ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు 9.30కి వెల్లడిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కోన్నారు. ఈ కొత్త సినిమా ప్రకటనతో.. సినీ అభిమానుల్లో ఆత్రుత, ఆసక్తి మొదలైంది. అసలు ఆ సినిమాలో ఏమి చూపించబోతున్నారు.. ఎవరీ గురించి ఆ సినిమా అంటూ ఆరాలు తీయసాగారు. కాగా అదంతా తూచ్ అంటూ అలాంటీ సినిమా ఏమి తీయట్లేదని స్పష్టం చేశాడు వర్మ.

Related posts