telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

సొంతింట్లో .. గొప్పలు పోతున్న .. మోదీ ..

pm on balkot issue in gujarat campaign

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటూ భారత్‌ను పాకిస్థాన్‌ బహిరంగంగా వేడుకోవాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లోని అమ్రేలీలో పర్యటిస్తున్న ఆయన బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని, అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం దాడులు చేసిన అనంతరం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన ప్రకటనపై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లోని రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే ఉగ్రవాదం ఉందని, ఈ జిల్లాల్లో తప్ప మరే ప్రాంతంలోనూ ఈ ఐదేళ్లపాటు బాంబు పేలుళ్లు చోటు చేసుకోలేదని ఆయన తెలిపారు.

గుజరాత్‌లోని సర్దార్ పటేల్‌ విగ్రహం.. నెహ్రూని అగౌరవపర్చడానికి నిర్మించిన విగ్రహం కాదని మోది తెలియజేశారు. సర్దార్‌ పటేల్‌ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయి ఉంటే, ఇప్పటి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండేవని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు గుజరాత్‌ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టును 40 ఏళ్ల క్రితమే పూర్తి చేసి ఉంటే గుజరాత్‌ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండేవని అన్నారు. నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా వేరే వారిని కనీసం ఐదేళ్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నుకోగలరా? అని ప్రశ్నించారు.

తాను గుజరాత్‌లో నేర్చుకున్న విషయాలు తనకు చాలా ఉపయోగపడుతున్నాయని మోదీ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. 2017లో డోక్లాంలో భారత్‌, చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సమయంలో అవి బాగా ఉపయోగపడ్డాయి అని మోదీ వ్యాఖ్యానించారు. కాగా, లోక్‌సభ మూడోదశ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని 26 స్థానాలకు ఏప్రిల్‌ 23న పోలింగ్‌ జరగనుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లోనూ గెలుపొందింది.

Related posts