telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పండగపూట పాక్ కుట్రలు … ఛీ అన్న గల్ఫ్ దేశం…

gulf country bahrain fire on pak on bakrid

కశ్మీర్ అంశం పై పాక్ పండగ రోజున రాద్ధాంతానికి తెరతీసింది. అయితే ఈ రాద్ధాంతం కాస్తా భారత సరిహద్దులు దాటి గల్ఫ్ దేశమైన బెహ్రెయిన్ కు చేరింది. జమ్ము,కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ను రద్దు చేయడంతోపాటు, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని బెహ్రెయిన్‌లోని పాకిస్థానీలు నిరసించారు. సోమవారం బక్రీద్ ప్రార్థనల తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారు.

పాక్ చర్యలను తీవ్రంగా పరిగణించిన బెహ్రెయిన్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. మతపరమైన కార్యక్రమాలను రాజకీయాల కోసం వినియోగించుకోవద్దని పౌరులను కోరింది. ‘‘చట్టాన్ని ఉల్లంఘించి ఈద్ ప్రార్థనల అనంతరం ర్యాలీ నిర్వహించిన ఆసియన్లపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నాం’’ అని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

Related posts