telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

13 జంతు ప్రదర్శన శాల (జూ)ల గుర్తింపు రద్దు

CZA cancels recognition of 13 zoos

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పలు జంతు ప్రదర్శన శాల (జూ)ల గుర్తింపు రద్దయ్యింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 13 జంతు ప్రదర్శన శాలల గుర్తింపు రద్దు చేసిందని పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్‌ శర్మ శుక్రవారం లోక్‌సభకు చెప్పారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ జంతు ప్రదర్శన శాలలు పనిచేయకపోవడంతో,  జంతువుల ఆరోగ్యం కోసం కేంద్ర జూ సంస్థ (సీజెడ్‌ఏ) వాటి గుర్తింపును రద్దు చేసినట్టు మంత్రి వివరించారు.

గుర్తింపు రద్దయిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న డీర్‌ పార్క్‌ ఎన్‌సీఎఫ్‌ఎల్, తెలంగాణలోని డీర్‌ పార్క్‌ కేశోరాం సిమెంట్, సంఘీ మినీ జూ, కర్ణాటకలోని తుంగభద్ర మినీ జూ, శ్రీ క్షేత్ర సొగల్‌ సౌండట్టి, తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న వీఓసీ పార్క్‌ మినీ జూ మొదలగునవి ఉన్నాయి.

Related posts