telugu navyamedia
ట్రెండింగ్ సాంకేతిక

పబ్‌జి : .. నిషేదిస్తున్నా.. అప్ డేట్ మాత్రం టైం కి అవుతూనే ఉంది..

pubg update released

పబ్‌జి మొబైల్ గేమ్ నూతన అప్‌డేట్‌ను గేమ్ డెవలపింగ్ సంస్థ టెన్సెంట్ గేమ్స్ విడుదల చేసింది. ఈ గేమ్‌కు కొత్తగా వచ్చిన 0.13.0 అప్‌డేట్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో గేమ్‌ను ఆడుతున్న యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా కొత్త అప్‌డేట్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

పబ్‌జి మొబైల్ 0.13.0 అప్‌డేట్ ఫీచర్లివే :

* గేమ్‌లో కొత్తగా డెత్‌మ్యాచ్ మోడ్‌ను ఇవో గ్రౌండ్‌లో అందిస్తున్నారు. ఇందులో బాగా వేగంగా ప్లేయర్లు మ్యాచ్ ఆడవచ్చు. టీపీపీ, ఎఫ్‌పీపీలలో ఈ మోడ్ అందుబాటులో ఉంది. అలాగే ఇందులో ప్లేయర్లు రూమ్ కార్డులను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.

* నూతన అప్‌డేట్‌లో ఎఫ్‌పీపీ కోసం కొత్తగా ప్రత్యేక సెట్టింగ్స్‌ను అందిస్తున్నారు.

* గేమ్‌లో చీట్ చేసే వారిని గుర్తించడం కోసం థర్డ్ పార్టీ యాప్ డిటెక్షన్ సిస్టమ్‌ను మరింత పకడ్బందీగా తీర్చిదిద్దారు. దీంతో గేమ్‌లో చీటింగ్ చేసే వారి ఆట కట్టినట్లు అవుతుంది.

* కొత్తగా ఎంవీపీ షోకేస్ అనే ఫీచర్‌ను ఈ అప్‌డేట్‌లో అందిస్తున్నారు.

* అందువల్ల మ్యాచ్ ముగిసి చికెన్ డిన్నర్ అయితే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎంవీపీ)ను తెలియజేస్తూ ప్రత్యేక విండో కనిపిస్తుంది. దాని పై భాగంలో కుడి వైపున ఉండే కంటిన్యూను క్లిక్ చేస్తే మ్యాచ్ ముగింపు స్క్రీన్‌కు వెళ్లవచ్చు.

* వికెండి మ్యాప్‌లో ప్లేయర్లు నడిస్తే వారి పాదాల అచ్చులు పడతాయి. వాటితో ఎనిమీలను ట్రాక్ చేయవచ్చు.

* అలాగే వాహనాల టైర్ల అచ్చులు కూడా పడతాయి.

* మ్యాచ్‌లో ప్లేయర్లకు ఎదురయ్యే గోడలు ఇతర ప్రదేశాలను ఎక్కేందుకు వీలుగా కొత్తగా క్లయింబింగ్ బటన్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

* ప్లేయర్లు తమ సొంత జట్టు సభ్యులనే చంపినట్లయితే చంపినవారికి పాయింట్లు ఇవ్వాలో, వద్దో..ఇతర ప్లేయర్లు నిర్ణయించవచ్చు.

* కొత్త అప్‌డేట్‌లో గాడ్జిల్లా థీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో లాబీ బ్యాక్‌గ్రౌండ్‌లో, ఈవెంట్ మ్యాచ్‌లలో ఈ థీమ్ మనకు కనిపిస్తుంది.

* కొత్తగా పాపులారిటీ గిఫ్ట్, ర్యాంకింగ్ రివార్డ్‌ను ఈ అప్‌డేట్‌లో అందిస్తున్నారు. ప్రతి వారం లిస్ట్‌లో ఉండే టాప్ 100 ప్లేయర్లు ఈ గిఫ్ట్, రివార్డ్‌లను అందుకోవచ్చు.

* కొత్తగా చరిష్మా ర్యాంకింగ్‌ను ఈ అప్‌డేట్‌లో అందిస్తున్నారు. గేమ్‌లో ప్లేయర్ క్యారెక్టర్లు ధరించే దుస్తులు, గన్ ఫినిషెస్‌ను బట్టి వారి చరిష్మా పెరుగుతుంది.

* జాంబీ మోడ్‌లో 4 కొత్త రకాల జాంబీలను డిజైన్ చేశారు. వాటికి కొత్త రకం ఎబిలిటీలు కూడా ఉంటాయి. పబ్‌జి మొబైల్ గేమ్‌ను ఇప్పటి వరకు 400 మిలియన్ల మంది యూజర్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని (చైనా కాకుండా) పబ్‌జి కార్పొరేషన్ తెలిపింది. అలాగే నిత్యం 50 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు గేమ్‌ను ఆడుతున్నారని కూడా ఆ సంస్థ తెలిపింది.

Related posts