సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే.. ప్రిన్స్ మహేష్ ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో కూడిన మామూలు స్వాంకీ వ్యానిటీ వ్యాన్‌కు ఓనర్ అయ్యాడు. ఇప్పటి వరకు మహేష్.. నిర్మాతలు ఏర్పాటు చేసే.. వ్యానిటీ వ్యాన్‌ను ఉపయోగించేవారు. కానీ రీసెంట్‌గా తన అభిరుచికి తగ్గట్టు ఓ వ్యానిటీ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడు. అందులో అన్ని రకాలు సదుపాయాలున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ కూడా ఓ ఇంద్రభవనం లాంటి కార్వాన్‌ను ఉపయోగిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ఇంటీరియల్ డిజైన్ కోసం రూ. 8 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే రేంజ్‌లో వ్యానిటీ వ్యాన్‌ను రెడీ చేయించుకున్నాడు. అయితే దీని డిజైన్‌కు 8 కోట్లకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
previous post
పొట్టి బట్టలు వేసుకున్నందుకు ట్రోల్ చేశారు : అవికా గోర్