telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ 30 : కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్ ?

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది ఎన్టీఆర్‌కు 30వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ అదిరిపోయే కథను సిద్ధం చేసాడని తెలుస్తుంది. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్. సంజయ్ దత్ ఈ సినిమాలో పక్కా రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం రమ్యకృష్ణ ను ఎంపిక చేసారని తెలుస్తుంది. బాహుబలి , సోగ్గాడే చిన్నినాయనా , శైలజ రెడ్డి అల్లుడు సినిమాలతో రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ చేసిన వెంటనే త్రివిక్రమ్ ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు.

Related posts