telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్, మంచు ఫ్యామిలీల మధ్యలో మనస్పర్థలు లేవు : మంచు విష్ణు

vishnu

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి హీరో మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు. . ప్రస్తుతం విష్ణు భారీ ఐటీ స్కాం నేపథ్యంలో రూపొందుతున్న ‘మోసగాళ్లు’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు విష్ణు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పుకొచ్చాడు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రస్తావిస్తూ.. అప్పట్లో పవన్ కళ్యాణ్ గురించి, మోహన్ బాబు ఎందుకు అలా మాట్లాడారని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా విష్ణు.. అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదు. కానీ అనవసరంగా ఓవర్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ ప్రశ్నకు సమాధానం ఆయన్ని అడిగితేనే దొరుకుతుంది. నాకు తెలిసి ఆ రోజు మా నాన్నగారు అంతగా ఏమీ మాట్లాడలేదని, వాళ్లిద్దరూ కొన్ని సంవత్సరాల నుండి కలిసి మెలిసి ఉంటున్నారని అన్నారు. కాగా అప్పట్లో చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానించిన వేడుకల్లో వారిద్దరి మధ్య సంభాషణ అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. కానీ ఈ మధ్య వీరి మధ్య ఇగోలన్నీ తొలగిపోయి మంచి స్నేహితుల్లా మారిపోయారు.

Related posts