telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా!

masks corona

తెలంగాణలో నిన్నటితో లాక్‌డౌన్ గడవు ముగియడంతో దానిని ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా నిత్యావసర, ఇతర దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా తప్పదని ఉత్తర్వుల్లో హెచ్చరించింది.

సడలింపుల్లో భాగంగా నిత్యావసర వస్తువులు, ఉత్పత్తి, విత్తనాలు, ఎరువులు సహా వ్యవసాయ సంబంధ దుకాణాలు వంటి వాటికి అనుమతి ఇచ్చింది. అలాగే, రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధి హామీ పనులు, ఆసుపత్రులు, మందుల దుకాణాలు, క్లినిక్‌లు, టెలికం, ఇంటర్నెట్, పెట్రోలు పంపులు, పోస్టల్, ఐటీ, ఐటీ సంబంధిత సేవలు, బ్యాంకులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సేవలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మెట్రో రైళ్లు, పాఠశాలలు, శిక్షణ సంస్థలు, హోటళ్లు, లాడ్జీలు, బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్ మాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, సామూహికంగా మతపరమైన కార్యక్రమాలు, క్రీడలు, వినోద కార్యక్రమాలు వంటి వాటికి జోన్లతో సంబంధం లేకుండా అన్నింటిని నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Related posts