telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పవన్ పాచిపోయిన లడ్డూల బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడు..

CPI Narayana

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కొండపైన పాచిపోయిన లడ్డూలు తింటున్నాడన్న ఆయన పాచిపోయిన లడ్డూల కేంద్రంతో తిరుపతిలో కూర్చుని బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని సపోర్ట్ చేస్తాడు ? అని ప్రశ్నించిన ఆయన అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తియ్యగా, కమ్మగా ఉన్నాయా? అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు బాయ్ కాట్ చేసాడని, ఎదుర్కోవాలి, పారిపోతే ఎట్లా కుదురుతుంది? అని ప్రశ్నించారు. క్రింద కేడర్ , రాజకీయ పార్టీ , ఓట్లు ఏమవుతాయి ? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి నలభై ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నా భయపడి పారిపోతే ఎలా కుదురుతుంది ? బతికుండి ఓటు వేయకపోతే చచ్చినట్లే లెక్క అని ఆయన అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, లోకల్ బాడీ ఎలక్షన్లో 90 శాతం మాకే వస్తాయి అన్న ధైర్యం ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఫ్రీ ఎలక్షన్ పెట్టొచ్చుకదా అని ప్రశ్నించారు.

Related posts