telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమ్మ నేర్పిన విషయాలు మంచి మనిషిగా మలిచాయి: ఎమ్మెల్యే రోజా

అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా తన తల్లి గురించి చెప్పారు. అమ్మ నేర్పిన విషయాలుతనను ఓ మంచి మనిషిగా మలిచాయని అన్నారు. తన స్ఫూర్తి అమ్మేనని చెప్పారు. తాను సినిమాల్లో ఎదగడానికి, రాజకీయాల్లో కొనసాగడానికి, ఆఖరికి ఓ గృహిణిగా విజయవంతం కావడానికి ఆమె ప్రోత్సాహమే కారణమని తెలిపారు. అయితే ఈ రోజు ఆమె తమ మధ్య లేకపోవడంతో ఎంతో బాధ కలిగిస్తోందని చెబుతూ భావోద్వేగాలకు లోనయ్యారు.

అమ్మ కారణంగానే తాను ఇవాళ మంచి వ్యక్తిత్వం ఉన్న మహిళగా సమాజంలో కొనసాగుతున్నానని తెలిపారు. తామందరం జీవితంలో స్థిరపడ్డామని, ఇలాంటి స్థితిలో తమ పిల్లలతో ఆడుకోవాల్సిన అమ్మ ఈ లోకంలో లేకపోవడం తీరని లోటు అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమ్మ గుర్తుకు వచ్చినప్పుడల్లా కన్నీటిపర్యంతం అవుతానని, అయితే అమ్మ లేని లోటును తన భర్త తీరుస్తున్నాడని రోజా వెల్లడించారు.

Related posts