telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్లు లేకుండానే సినిమా…

తమిళంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కాతు వాకుల రెండు కదల్. ఈ సినిమాలో నయనతారా, సమంతా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇది ఒక రొమాంటిక్ సినిమాగా తెరకెక్కనుంది. లలితా కుమార్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానుంది. అయితే ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం సమంతా, నయనతారా లేకుండానే విఘ్నేష్ సినిమా చిత్రీకరణను ప్రారంభించాడట. దాంతో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. దీంతో పాటు ట్విటర్‌లో నయనతారా పేరు ట్రెండ్ అవుతోంది. అయితే ప్రధాన పాత్ర ధారులు లేకుండా సినిమా చిత్రీకరణ ఎలా మొదలు చేస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో విఘ్నాష్ ఏమనిది చెబుతాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేయడానికి విఘ్నేష్ దాదాపు రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిచనున్నాడని, సినిమా చిత్రీకరణ దక్షిణ భారత్‌లోనే చేయనున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని అందిస్తుందని అన్నాడు.

Related posts