telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రయాణాల్లో వాంతులు వస్తున్నాయా… అయితే ఇలా చెక్‌ పెట్టండి !

మనం ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు తీసుకుంటాం. అలాంటి ఆహారం తీసుకుంటేనే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. అందుకే ఎలాంటి వారైనా మంచి ఆహారం తీసుకోవడానికే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొందరికి దూర ప్రయాణాలు, బస్సులో కొంచెం దూరం ప్రయాణించినా వాంతు వస్తుంటాయి. బస్సుల్లోగానీ, రైళ్లల్లోగానీ ప్రయాణిస్తున్న వేళల్లో కొందరికి తలనొప్పి, తల తిరగడం, వికారంతో పాటు విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఈ స్థితికి ఇతర కారణాలు కూడా ఉన్నా, దీర్ఘకాలికమైన మలబద్ధకం కూడా ఒక కారణమే. ఇలాంటి వారు ఆహారంలో పండ్లు, పీచు పదార్ధాల మోతాదును పెంచడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. లేదంటే వారానికి ఒకసారి త్రిఫళా చూర్ణం వేసుకోవడం ద్వారా మలబద్ధకం నుంచి వాంతుల సమస్యనుంచి బయటపడవచ్చు.
1. ప్రయాణ సమయంలో యాలకులు, లవంగాలు, జీలకర్ర వీటిల్లో ఏదో ఒకటి నోటిలో వేసుకొని కొంచెం కొంచెంగా నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉండాలి.
2. ఉసిరికాయను నోటిలో ఉంచుకుని కొంచెం కొరికి ఆ రసాన్ని నిదానంగా మింగుతూ ఉండాలి. లేదా కొంచెం చింతపండును చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే ప్రయాణం తాలూకు వికారం, వాంతుల బాధ ఉండదు.
3. ఒకవేళ ఇవీ పని చేయకపోతే, ఆయుర్వేద షాపుల్లో దొరికే జంబీరాదిపానకం, పైత్యాంతకం లేదా మాతులుంగ రసాయనం వీటిల్లో ఏదో ఒకటి తీసుకుంటే ఈ వికారం, వాంతుల సమస్యల నుంచి దూరం కావచ్చు.

Related posts