telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చెప్పులు లేకుండా నడుస్తున్నారా !

ప్రస్తుతం కాలంలో ఎవరి పనిలో వారు ఫుల్‌ బిజీ అయిపోయారు. దీంతో తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. టెన్షన్‌ లో చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. నిత్యం చెప్పులు, లేక షూస్‌ వేసుకుని పాదాలకు రక్త ప్రసరణ లేకుండా చేస్తున్నారు. అయితే.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా చెప్పులు లేకుండా రోజుకు ఒక్కసారైన నడవాలని నిపుణులు చెబుతున్నారు.
చెప్పులు లేకుండా నడిస్తే కలిగే లాభాలు

శరీర భంగిమ సరిగ్గా ఉంటుంది. సహనం కూడా పెరుగుతుంది.
పొత్తి కడుపుపై ఒత్తిడి కలిగి, జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది.
చిన్న, చిన్న రాళ్లు పాదాలకు గుచ్చుకోవడం వల్ల పాదాల్లో రక్త ప్రసరణ పనితీరు మెరుగవుతుంది. బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది
మానవుని పాదాల్లో 72 వే నరాల కొనలు ఉంటాయి. ఎక్కువసేపు పాదారక్షలు వాడడం వల్ల సున్నితమైన నరాలు చచ్చుబడిపోతాయి. అదే చెప్పుల్లేకుండా నడవడం వల్ల ఈ నరాలు యాక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి పార్కుల్లో, ఆఫీసుల్లో, ఇంట్లో చెప్పుల్లేకుండా నడిచే అలవాటును అలవర్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.

Related posts