హైదరాబాద్ వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాలు, వరదలకు హైదరాబాద్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. అయితే మరో నాలుగు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాదు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్వయంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వరద బాధితులకు ఆదుకునేందుకు తమిళనాడు సీఎం పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వ సహాయక చర్యలకు అండగా ఉండేందుకు ఈ సహాయం ప్రకటించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఆపద సమయంలో ప్రజలను ఆదుకునేందుకు తన వంతు బాధ్యతగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సాయంతో పాటు, బ్లాంకెట్లు, చద్దర్లు, ఇతర సామాగ్రి కూడా పంపుతామని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంతో ఉదారంగా ముందుకు వచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, తమిళనాడు ప్రజలకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
previous post
next post
సాక్షి పత్రికలో బడ్జెట్ పై భజన వార్తలు: నారా లోకేశ్