telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

అతివేగంగా విడాకుల జారీ.. కేవలం 3 నిముషాలలో..

marriage wishes gone viral and case filed

సాధారణంగా వివాహం అయ్యాక, ఏడాదికి గాని విడాకులు రావు. వివాహం అవగానే విడాకులకు దరఖాస్తు చేసుకున్నా కూడా కనీసం ఆరు నెలలు పడుతుంది అవి రావడానికి. కానీ ఈ జంట విషయంలో ఆ నియమాలు తప్పారు.. ఎందుకో మీరే చదివి తెలుసుకోండి.. మీకు ఉపయోగపడొచ్చు.. వివాహమైన ఓ జంట మూడంటే మూడు నిమిషాల్లో విడాకులు తీసుకుంది. న్యాయమూర్తి సైతం ఆ జంటకు విడాకులు మంజూరు చేశాడు. ఈ ఘటన కువైట్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కువైట్‌ లో వధూవరులు, తమ వివాహ రిజిస్ట్రేషన్‌ కోసం న్యాయమూర్తి ఎదుట సంతకాలు పెట్టేందుకు వెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం, కోర్టు నుంచి బయటకు వస్తున్న వేళ, వధువు పొరపాటున కాలు జారి కింద పడింది.

పక్కనే ఉన్న వరుడు ఆ అమ్మాయికి తన చేతిని అందించి సాయం చేయాల్సింది పోయి, కింద పడి పరువు తీశావంటూ, పరుష పదజాలానికి దిగాడు. దీనితో అతనితో తన జీవితం సాఫీగా ఉండదని భావించిన ఆమె, ఒక్క ఉదుటన జడ్జి దగ్గరకు వెళ్లి, విషయం చెప్పి, విడాకులు కావాలని అడుగగా, ఆయన వెంటనే మంజూరు చేశాశాడు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఇదంతా జరిగింది. కువైట్‌ చరిత్రలో అతి తక్కువ వ్యవధిలో విడాకులు తీసుకున్న జంట వీరిదేనని స్థానిక మీడియా ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది. కాగా, గతంలో దుబాయ్ లో ఓ జంట పెళ్లియన 15 నిమిషాల వ్యవధిలో విడాకులకు దరఖాస్తు చేసి, మంజూరు చేయించుకుంది. ఇక, ప్రపంచంలో పెళ్లయిన అతి కొద్ది సమయంలోనే విడాకులు తీసుకున్న జంట కూడా ఇదే కావచ్చేమో!

Related posts