ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ మరో వింత ఘటన చోటుచేసుకుంది. అయితే అక్కడ మొదటి దశ ఎన్నికల ప్రచార సమయం కూడా ముగిసింది. ఈ సమయంలో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. కొత్తూరు మండలం మాతల గ్రామం నుంచి కలమట కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు పోటీ పడుతుండటం అందరి చూపు ఇప్పుడు మాతల గ్రామం పైనే ఉంది . పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు సతీమణి కలమట వేణమ్మ టీడీపీ నుంచి , చిన్న కోడలు కలమట సుప్రియ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు . గతంలో నాలుగు సార్లు మాతల గ్రామానికి సర్పంచ్ గా కలమట వేణమ్మ గెలిచారు . ఐతే ఇప్పుడు ఆ కుటుంబం నుంచే స్వయానా కోడలే వేణమ్మ పై పోటీకి దిగడం ఆసక్తిగా మారింది . నేటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈ అత్తాకోడళ్లు హోరాహోరీగా ప్రచారం చేపట్టారు . 9వ తేదీ ఎన్నికల్లో ప్రజలు ఈ అత్తా కోడళ్లలో ఎవరిని సర్పంచ్ గా ఎన్నుకుంటారో చూడాలి మరి. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.
రాముడి బాటలోనే ఐదేళ్లు సుపరిపాలన: చంద్రబాబు