telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నందిగ్రామ్ లో తారుమారైన ఫలితం…

పశ్చిమ బెంగాల్ లో రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ అద్భుత విజయం సాధించింది. ఉదయం నుంచి ఆధిక్యాని కనబరిచిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 221 స్థానాలు గెలుచుకుంది. కానీ నందిగ్రామ్ నుండి పోటీ చేసిన ఆపార్టీ నాయకురాలు మమత బెనర్జీ మాత్రం ఓడిపోయారు. అయితే ఈ రోజు కరిగిన కౌంటింగ్ లో మొదట బీజేపీ నుండి పోటీ చేసిన సువేందు అధికారి ఆధిక్యత కనబరిచిన ఏడో రౌండ్ నుంచి దీదీ ఆధిక్యంలోకి వచ్చారు. అయితే మళ్ళీ 16 వ రౌండ్ లో మమత పై సువేందు 6 ఓట్ల లీడింగ్ లో వెళ్లారు. దాంతో ఆఖరి 17 వ రౌండ్ ఫలితం పై ఉత్కంఠ నెలకొంది. కానీ ఆ చివరి రౌండ్ ఫలిత వెలువడిన తర్వాత మమత పై సువేందు అధికారి 1622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ ఓటమి పై స్పందించిన దీదీ.. నందిగ్రామ్ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు మమత బెనర్జీ పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధిలా ఈసీ పనిచేసిందని అన్నారు.

Related posts