ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే… పామ్ బీచ్ కౌంటీలో నివాసముండే 23 ఏళ్ల అంబర్ బ్లాక్ అనే యువతి 65 ఏళ్ల వృద్ధుడితో సహజీవనం చేస్తోంది. అయితే గత శుక్రవారం రాత్రి అంబర్ తన ప్రియుడితో టీవీ రిమోట్ విషయమై గొడవకు దిగింది. మాటమాట పెరగడంతో ప్రియుడ్ని వృద్ధుడు అని కూడా చూడకుండా అతడిపై దాడికి పాల్పడింది. ప్రియుడి ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. అనంతరం ప్రియుడ్ని కిందపడేసి అతడి జననాంగాలను గట్టిగా అదిమి పట్టి చేతి వేళ్ళ గొర్లతో రక్కేసింది. ఆమె నుంచి ఎలాగోలా తప్పించుకొని వృద్ధుడు పోలీసులకు సమాచారం అందించాడు. వృద్ధుడి సమాచారంతో అక్కడికి వచ్చిన పోలీసులకు అతడు తీవ్ర గాయాలతో కింద పడి ఉండడం కనిపించింది. వృద్ధుడు పోలీసుల విచారణలో జరిగిన విషయం చెప్పాడు. దాంతో పోలీసులు అంబర్‌ను అదుపులోకి తీసుకొని కటకటాల్లోకి నెట్టారు. కాగా, పామ్ బీచ్ కౌంటీ జైలు రికార్డుల ప్రకారం అంబర్ రూ. 5లక్షల 73 వేల పూచీకత్తు విడుదలైనట్టు తెలిసింది.
previous post