telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్‌-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సూపర్ రికార్డు…

ఆస్ట్రేలియా పర్యటన నుండి వచ్చిన తర్వాత భారత జట్టు నేరుగా ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆసిన్ విషయం తెలిసిందే. అయితే ఈ టెస్టు సిరీసు అరుదైన ఘనత సాధించింది. వ్యూయర్షిప్ పరంగా ఐదేళ్ల క్రితంనాటి రికార్డును బద్దలుకొట్టింది. ఎంతో ఆసక్తికరంగా సాగిన టెస్టు సిరీస్‌ను ఏకంగా 10.3 కోట్ల మంది వీక్షించారు. నిమిషానికి సగటు వీక్షకుల సంఖ్య 10.3 లక్షలుగా నమోదైందని స్టార్ ఇండియా హెడ్ సంజోగ్ గుప్తా తెలిపారు. కరోనా వైరస్‌ మహమ్మారి ముప్పుతో దాదాపుగా ఏడాది తర్వాత భారత గడ్డపై క్రికెట్‌ ఆరంభమైన సంగతి తెలిసిందే. హెడ్ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ… ‘టెస్ట్ సిరీస్‌కు భారీ స్పందన రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. కరోనా కారణంగా దాదాపు ఒక సంవత్సరం తరువాత భారతదేశంలో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభం కావడం, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టడంతో సుదీర్ఘ ఫార్మాట్‌పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే‌ టెస్టు సిరీస్‌కు భారీ స్థాయిలో వీక్షణలు లభించాయి. నాలుగు ప్రాంతీయ భాషలలో ప్రసారం కూడా కలిసివచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ఆనందాన్నే ప్రేక్షకులకు అందిస్తుంటాం’ అని తెలిపారు. నాలుగు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలో తొలుత ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత మూడు టెస్టులో భారత్ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది.

Related posts