telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మోడీని కలవడానికి ..బాబు ప్రయత్నాలు.. ఎందుకంటే ..

chandrababu thanks to pm modi

ఏపీలో గత ప్రభుత్వం అప్పటి ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగించలేకపోయింది. దీనితో అప్పటిలోనే చంద్రబాబుకు మోడీని కలవాలంటే కుదరలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా బాబు మోడీ ని కలవడానికి చేయాల్సిన ప్రయత్నాలు  చేస్తున్నట్టు సమాచారం. ఏదిఏమైనా రాజకీయాల్లో ఇంతేనని ఎంత సరిపెట్టుకున్నా బాబు అతి చేసిన తీరు అన్నిటికీ అతీతమైనది. ఎంతలా రాజకీయాల్లో విమర్శలు ఉన్నా వాటిని బాబు ఎపుడో అధిగమించేశారు.  మోడీపైన వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. వచ్చీ రాని హిందీలో బావమరిది బాలయ్య మోడీని విమర్శిస్తూ ఉంటే బాబు నవ్వుతూ తిలకించారు. ఓ పెయిడ్ సినీ ఆర్టిస్ట్ మోడీ ఏం చదువుకున్నారని ఢిల్లీ ధర్నాలో అంటే బాబు ముసిముసినవ్వులు నవ్వారు.

ఇంత చేసిన బాబుకు తన స్థానం ఏంటో ప్రజలు చూపించారు. మోడీ స్థానం ఏంటో కూడా చూపించారు. రాజకీయంగా చూసుకుంటే బాబు మోడీ ముందు ఇపుడు ఏమీ కాని పరిస్థితి. ఓ విధంగా బాబు రాజకీయం డెడ్ ఎండ్ అయినట్లుగానే ఉంది. ఈ నేపధ్యంలో మళ్ళీ మోడీతో రాయబేరాలకు బాబు రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తే స్వయంగా వెళ్ళి కలవాలని బాబు అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధాని అపాయింట్మెంట్ కోసం బాబు మనుషులుగా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారు గట్టిగా ట్రై చేస్తున్నారటని టాక్. మరి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా. మోడీ రాజకీయం తెలిసిన వారు ఎవరూ ఇవ్వరూ అనే అనుకుంటారు. కానీ మోడీ కూడా బాబు స్కూల్ నుంచి వచ్చిన వారే కదా ఏమో ఇస్తే ఇవ్వవచ్చేమో అన్న మాట వినిపిస్తోంది. మోడీని కలిసే బాబు ఏం చెబుతారు, బాబు, మోడీ ఏం మాట్లాడుకుంటారు, ఇవన్నీ ఆసక్తికరమైన వార్తలే. మరి చూడాలి మోడీ బాబు రాజకీయం ఏంటో రాజకీయ వెండితెర మీదనే.

Related posts