telugu navyamedia
రాజకీయ వార్తలు

10 కోట్ల డోసులకు 200 కోట్ల డాలర్లు.. ట్రంప్ సర్కారు ఒప్పందం!

trump usa

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం యుద్ధ ప్రాతిపదికన పరిశోధనలు సాగుతున్నాయి. నిర్ణీత కాలం కంటే ముందే వ్యాక్సిన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు పరిశోధనలు జరుగుతుండగానే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఫైజర్-బియోఎన్ టెక్ ఎస్ఈ భాగస్వామ్యంతో తయారవుతున్న వ్యాక్సిన్ కోసం అమెరికా ప్రభుత్వం ఆరాటపడుతోంది. డిసెంబరు కల్లా 10 కోట్ల డోసులు సరఫరా చేస్తే అమెరికా 200 కోట్ల డాలర్లు చెల్లించనుంది. ఆపై వాటి పనితీరు ఆధారంగా మరో 50 కోట్ల డోసుల కొనుగోలు చేసేందుకు అమెరికా సంసిద్దమవుతోంది.

Related posts