వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. జగన్ జాతకం మొత్తం సీబీఐ, ఈడీ వద్ద ఉందని చెప్పారు. విశాఖపట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీలు మంచి నాయకులను పెడితే తాను మంచి నాయకులను నిలబెడతానని చెప్పారు. వారు మంచి నేతలను పెట్టకపోతే… తాను కూడా అలాంటివాళ్లనే నిలబెడతానని అన్నారు. పక్క పార్టీల క్రిమినల్ లీడర్లు మీద పడితే వారిని ఎదుర్కోవడానికి తమకు కూడా మాస్ లీడర్లు కావాలని అన్నారు.రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తానని అన్నారు. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు తనకు బలమైన నాయకులు కావాలని చెప్పారు.
previous post
next post