telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ ప్రభుత్వం : .. క్రీడాకారులకు నగదు ప్రోత్సహకాలు.. 5 లక్షలు..

AP

ఏపీ క్యాబినెట్ వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు అనే పథకం ద్వారా జాతీయ స్థాయిలో పతకాలు సాధించినటువంటి క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో గోల్డ్ మెడల్ సాధిస్తే గనక అయిదు లక్షల రూపాయలు, సిల్వర్ మెడల్ సాధిస్తే నాలుగు లక్షల రూపాయలు, బ్రాంజ్ మెడల్ సాధిస్తే గనక మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సుమారుగా ఐదు కోట్ల రూపాయల వరకు అవుతుందని ప్రభుత్వం అంచనా. గడచిన అయిదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశ ప్రభుత్వం దేశంలోని మిగతా రాష్ట్రాల వాళ్ళు చూసి మనల్ని నవ్వుకునేలాగా ఎంత పెద్ద మెడల్ సాధించిన కేవలం పాలకులకు ఇష్టమైన వారికి మాత్రమే ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. 

ఈ లోపానికి ఎవరైతే గత ప్రభుత్వం చేత నిర్లక్ష్యానికి గురికాబడ్డారో వారికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరైతే మెడల్స్ వారందరికీ కూడా నగదు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం ఐదు కోట్లు లేదా అదనంగా కూడా ఎంతైనా బరించటానికి ఎపి ప్రభుత్వం సిద్ధంగా ఉందని క్యాబినెట్ నిర్ణయించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ సాధించినటువంటి సింధూకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ అభినందిస్తూ తనకి ప్రోత్సాహం అందించాలని తీర్మానించటమే కాకుండా భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని, తెలుగు వారు గర్వపడేలా మన కీర్తిని ప్రపంచానికి చాటేలా ఎన్నో విజయాలు సాధించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరంలో డీఆర్ డీవో కు సంబంధించినటువంటి ఒక రాకెట్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం కోసం ఐదెకరాల స్థలాన్ని భూమిని కేటాయిస్తూ మంత్రి వర్గం తీర్మానం చేయటం జరిగింది.

Related posts