ఇండోనేషియాలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య150 దాటింది. ఆకస్మిక వరదలు.. కొండచరియలు విరిగిపడడం వల్ల భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈస్ట్ తైమోర్‌తో పాటు పలు ప్రాంతాల్లోని గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలో ఉన్నాయ్. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సైక్లోన్ సెరోజా వల్ల గ్రామాలన్నీ నీటమునిగాయ్. చెట్లు కూలిపోయాయ్. సమీప సరిహద్దుల్లో ఉన్న దేశాలకు సుమారు పది వేల మంది వలస వెళ్లిపోయారు.ఈస్ట్ తైమోర్ వద్ద ఉన్న దీవుల్లోనే 130 మంది ప్రాణాలు కోల్పోయారు.
next post