telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజ‌య‌వాడ సంఘ‌ట‌న ఏపీకే అవ‌మానం..-నిందితుల‌ను ప్ర‌త్యేక కోర్టు పెట్టి ఊరితీయాలి

*అత్యాచార కేసు బాధితురాలిని ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు
*విజ‌య‌వాడ గ్యాంగ్ రేప్ సంఘ‌ట‌న ఏపీకే అవ‌మానం..
*ప్ర‌త్యేక కోర్టు పెట్టి నిందితుల‌ను ఊరితీయాలి..
*ఆస్ప‌త్రికి వ‌చ్చి బాధితురాలిన జ‌గ‌న్ ప‌రామ‌ర్శించాలి..
*విజయవాడ బాధితురాలికి టీడీపీరూ. 5ల‌క్ష‌లు పరిహారం

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార కేసు బాధితురాలిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు.బాధితురాలికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున రూ.5 లక్షలు పరిహారం ప్రకటించారు.

అనంత‌రం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం ఏపీకే అవమానం అని అభిప్రాయపడ్డారు.

జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని.. ఈ సంఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ తాను మాత్రం సిగ్గుపడుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇలాంటి సంఘటనలు రోజూ ఏదో ప్రాంతంలో జరుగుతున్నాయని.. ఇలాంటివి చూస్తుంటే అసలీ ప్రభుత్వానికి పాలించే అర్హత ఉందా అని ప్రశ్న తలెత్తుతుందన్నారు.

గ్యాంగ్ రేప్ సంఘటన ప్రభుత్వానికి అవమానంగా అనిపించట్లేదా అని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో ఇంకెన్ని మానభంగాలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందో అర్ధం కావడం లేదన్నారు.

ఇలాంటి సంఘటనలపై ఎవరైనా మాట్లాడితే తన చెంచాలతో తిట్టించడం జగన్‌కు అలవాటైపోయిందన్నారు చంద్రబాబు. ఇలాంటి వాటికి భయపడే రోజులు పోయాయని ఇకపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు

బాధితురాలికి న్యాయం జరగాలని… నిందితులకు తక్షణం శిక్ష పడాలని ఈ సందర్భంగా చంద్రబాబు డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు పెట్టించి శిక్షలు విధించాలని సవాల్ చేశారు. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై, ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత అన్నారు.

తన ఇంటి పక్కనే ఉన్న ఆసుపత్రికి వచ్చి బాధితురాలిని పరామర్శిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబు నిలదీశారు. బాధితురాలుకు కోటీ రూపాయల సాయం అందివ్వాలన్నారు. ఫ్యామిలీ కోసం ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts