telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సుప్రీంకోర్టులో ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు..

*సుప్రీం కోర్టులో ఏబీ వెంక‌టేశ్వ‌రావుకు ఊర‌ట‌..
*ఐపీఎస్ అధికారి స‌స్పెన్ష‌న్ ర‌ద్దు ..
*మ‌ళ్ళీ స‌ర్వీసులోకి తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వానికి ఆదేశం ఆదేశం..

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై గత రెండేళ్లుగా ఉన్న సస్పెన్షన్ ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావును మ‌ళ్ళీ సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలకు పాాల్పడ్డారనే ఆరోపణలతో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వం 2020లో ఫిబ్రవరిలో సస్పెండ్ చేసింది .రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

సస్పెన్షన్ రెండేళ్లు కాలం పూర్తి అయినందున ఏబీ వెంకటేశ్వరరావును వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది

చంద్ర‌బాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. అయితే ఇజ్రాయిల్ నుండి నిఘా పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించారని జగన్ సర్కార్ ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఆయనను సస్పెండ్ చేసింది.

అయితే రెండేళ్లు దాటినా సస్పెన్షన్‌ను తొలగించకపోవడంతో ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పిటిషన్‌పై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. రెండేళ్లు దాటినా ఇంకా సస్పెన్షన్ తొలగించకపోవడంపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

అఖిల భారత సర్వీసు అధికారులను రెండేళ్లకు పైగా సస్పెన్షన్‌లో ఉంచడం చట్ట విరుద్ధమని అభిప్రాయపడింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయని పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు స్పష్టం చేశారు.

Related posts