విజయవాడలోని కరోనా చికిత్సా కేంద్రం స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. కరోనా వైరస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినవారు ప్రమాదం బారినపడటం విషాదకరమని అన్నారు.
మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రమేశ్ హాస్పిటల్స్‌కు అనుబంధంగా వినియోగిస్తోన్న స్వర్ణపాలెస్ హోటల్లో నడుస్తున్న ఈ కరోనా కేంద్రంలో రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న విషయంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు బంధు ఎన్నికల బందుగా మారింది: రేవంత్‌రెడ్డి