దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ సినిమా విషయంలో టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతిస్తున్నట్లుగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని.. సినిమాకు హీరో, హీరోయిన్ల రెమ్యూనేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని.. పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.336 కోట్లు ఖర్చు అయినట్లుగా చిత్ర టీమ్ దరఖాస్తులో పేర్కొందని వెల్లడించారు. ఆ మేరకు టీడీఎస్, జీఎస్టీ కూడా వారు చెల్లించారని వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల తర్వాత 10 రోజుల వరకూ టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతించినట్లుగా వెల్లడించారు.
ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆన్‌లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని. త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.
యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: పవన్ కల్యాణ్