telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏ బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం ఇలా చేశారు-ఐపీఎస్ అధికారి ఏబీవీ

*చ‌ట్ట ప్ర‌కారం నా కున్న అన్నీ అవ‌కాశాలు వినియోగించుకున్నా..
*ఏ బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం ఇలా చేశారు..
*నేను లోక‌ల్ – ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌ను..
*ఏ సైకో కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం ఇలా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ .. ఒక తప్పుడు నివేదిక ఆధారంగా 24 గంటల్లో తనను సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరునెలల కోసారి సస్పెన్షన్‌ పొడిగిస్తూ రిపోర్టులిచ్చారన్నారు.

తనపై కావాలనే విషప్రచారం చేశారన్నారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి.. రెవెన్యూ రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు వదలనని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి, అధికారులకు రూల్స్ తెలియవా అంటూ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.. చట్ట ప్రకారమే తాను పోరాటం చేశానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఏ సైకో కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం ఇలా చేశారు?.. ఇదంతా జరిగేందుకు కారకులెవరని ఆయన ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తన తప్పా..? అని ఏబీవీ నిలదీశారు.

ఈ కేసు రెండేళ్ల రెండు నెలలపాటు కొనసాగిందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. లాయ‌ర్లు కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించిన అధికారులపై ఫిర్యాదు చేశానన్నారు. కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.

Related posts