telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

మళ్ళీ మోదీ రాజ్యమే.. : ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ సర్వే

india tv-cnx survey on India

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా 295 సీట్లను గెలుచుకోనుందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే పేర్కొంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నదని అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 127 సీట్లు వస్తాయని, ఇతరులకు 121 సీట్లు రావచ్చని ఈ సర్వే వెల్లడించింది.

రాష్ట్రాల వారీగా అంచనాలను పరిశీలిస్తే.. :
ఉత్తరప్రదేశ్ లో మొత్తం స్థానాలు 80 : బీజేపీ 46, బీఎస్పీ 13, సమాజ్ వాదీ 15, కాంగ్రెస్ 4, ఆర్ఎల్డీ 1, అప్నాదళ్ 1 స్థానాల్లో గెలవవచ్చు.
ఉత్తరాఖండ్ లో 5 : బీజేపీ 4, కాంగ్రెస్ 1.
రాజస్థాన్ లో 25 : బీజేపీ 19, కాంగ్రెస్ 6.
పశ్చిమ బెంగాల్ లో 42 : తృణమూల్ కాంగ్రెస్ 29, బీజేపీ 12, కాంగ్రెస్ 1.
ఒడిశాలో 21 : బిజూ జనతాదళ్ 13, బీజేపీ 7, కాంగ్రెస్ 1.
మధ్యప్రదేశ్ లో 29 : బీజేపీ 23, కాంగ్రెస్ 6.
ఛత్తీస్ గఢ్ లో 11 : కాంగ్రెస్ 6, బీజేపీ 5.
పంజాబ్ లో 13 : కాంగ్రెస్ 10, ఆకాలీదళ్ 3.
హర్యానాలో 10 : కాంగ్రెస్ 1, బీజేపీ 9.
బీహార్ లో 40 : బీజేపీ 15, ఆర్జేడీ 5, జేడీ (యూ) 13, కాంగ్రెస్ 2, ఎల్జేపీ 3, ఆర్ఎస్ఎల్పీ 1, వీఐపీ 1.
జార్ఖండ్ లో 14 : బీజేపీ 9, జేఎంఎం 2, కాంగ్రెస్ 2, ఏజేఎస్యూ 1.
గుజరాత్ లో 26 : బీజేపీ 24, కాంగ్రెస్ 2.
హిమాచల్ ప్రదేశ్ లో 4 : బీజేపీ 3, కాంగ్రెస్ 1.
మహారాష్ట్రలో 48 : బీజేపీ 21, శివసేన 15, కాంగ్రెస్ 6, ఎన్సీపీ 6.
గోవాలో 2 : బీజేపీ 1, కాంగ్రెస్ 1.
తమిళనాడులో 39 : డీఎంకే 16, అన్నాడీఎంకే 10, కాంగ్రెస్ 4, బీజేపీ 1, పీఎంకే 2, ఇతరులు 6.
ఆంధ్రప్రదేశ్ లో 25 : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20, టీడీపీ 5.
తెలంగాణలో 17 : టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఏఐఎంఐఎం 1.
కర్ణాటకలో 28 : బీజేపీ 16, కాంగ్రెస్ 10, జేడీ (ఎస్) 2.
జమ్మూ కాశ్మీర్ లో 6 : బీజేపీ 2, ఎన్సీ 3, కాంగ్రెస్ 1.
ఆసోంలో 14 : బీజేపీ 6, ఏఐయూడీఎఫ్ 2, కాంగ్రెస్ 4, ఇతరులు 2.
ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 11: బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఎన్సీపీ 2, ఎన్డీపీపీ 1, ఎస్డీఎఫ్ 1.
ఢిల్లీలో 7 : బీజేపీ 7.
కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 : బీజేపీ 4, కాంగ్రెస్ 2.

Related posts