telugu navyamedia
తెలంగాణ వార్తలు

పొరపాటున నోరు జారా .. క్షమించండి -కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణలు

తెలంగాణలో కాంగ్రెస్ లో విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది.శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని సైతం ఉద్దేశిస్తూ.. పార్టీలో ఉంటే ఉండూ లేకుంటే.. అంటూ అభ్యంతరకర కామెంట్స్ పార్టీలో సెన్సేషనల్ గా మారాయి. .

ఈ క్ర‌మంలో ఆయనపై సీనియర్లు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పైగా సీనియర్ల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ,ఎవరూ నిలువరించకపోవడంపై ఏఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 

అంతేకాదు పలుచోట్ల అద్దంకి దయాకర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.. దీంతో అద్దంకి దయాకర్ వెనక్కి తగ్గారు. తన మాటను వెనక్కి తీసుకున్నారు

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ క్షమాపణలు చెప్పారు. అభ్యంతరకరవ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు అద్దంకి దయాకర్‌ ప్రకటించారు. 

తాను మాట్లాడిన మాట తెలంగాణలో వాడుక భాష అని.. దానిపై కొందరు అసంతృప్తిగా ఉన్నారని.. అందుకు వెంకట్ రెడ్డికి క్షమాపణ చెబుతున్నానని ఆయన చెప్పారు.

ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి..పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను భావించను. నా వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ ఇవ్వాలని అనుకున్నా. ఈ లోపే షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. పార్టీ విధానాలు దాటి వ్యక్తుల ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని భావించనని.. మరొకసారి ఇలా జరగదని అద్దంకి దయాకర్ తెలిపారు.

Related posts