telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తగ్గుముఖం పడుతున్న.. బంగారం-వెండి ధరలు..

gold and silver prices in markets

ఇటీవలే 40 వేలను తాకిన 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర, ఇప్పుడు భారీగా దిగివచ్చింది. అంతర్జాతీయంగా మార్కెట్లో నెలకొన్న పరిస్థితులతో పాటు స్టాక్ మార్కెట్లు పుంజుకోవడంతో, పెట్టుబడిదారులు బులియన్ మార్కెట్ నుంచి వైదొలగుతున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. నిన్న ఒక్కరోజులో బంగారం ధర ఇండియాలో 10 గ్రాములకు రూ. 672 తగ్గి, రూ. 37,575కు చేరింది. బుధవారంతో పోలిస్తే, ఇది 1.75 శాతం తక్కువ. ఇదే సమయంలో వెండి ధర కిలోకు ఏకంగా రూ. 1,490 పడిపోయి, రూ. 44,168కి చేరుకుంది.

ఫ్యూచర్స్‌ కమోడిటీ మార్కెట్‌ ఉనైమెక్స్‌ లో ఔన్స్‌ బంగారం ధర 30 డాలర్లకు పైగా పతనమై, 1,462 డాలర్ల వద్దకు చేరింది. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్టు అమెరికా, చైనా ప్రకటించడంతో చాలామంది ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇక నేడు కూడా బంగారం ధర దిగివస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Related posts